- నివాళులర్పించిన బిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి రమేష్
నమస్తే శేరిలింగంపల్లి: ప్రజా గాయకుడు యుద్ధ నౌక, విప్లవ వీరుడు పేదల కోసం పాటుపడి తన జీవితం అంకితం చేసిన త్యాగమూర్తి గద్దర్ అని బిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి రమేష్ కొనియాడారు. మియాపూర్, బిఆర్ఎస్ కార్యాలయం ప్రాంగణంలో బిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి రమేష్ ఆధ్వర్యంలో గద్దర్ కి శ్రద్ధాంజలి ఘటించి పూలమాలతో నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో గుమ్మడి విట్టల్ రావును స్మరించుకుని మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించి తన పాటలతో ఉద్యమాన్ని ఉర్రూతలూగించారని, తెలంగాణ వచ్చేవరకు ప్రజలతో ఉన్నారని చెప్పారు. తూటాలకు ఎదురొడ్డి శరీరం పూర్తిగా గాయాలై పక్క ఎముకలో రైఫిల్ తూటా ఉన్న వెరువక మరణించే వరకు పాటలతో పేద ప్రజలలో చైతన్యం నింపారన్నారు. ఈ కార్యక్రమంలో బండి రమేష్ తో పాటు మల్లికార్జున శర్మ, గంగారం సంగారెడ్డి, శేఖర్ గౌడ్, శంకర్ నాయక్, తెప్ప బాలరాజ్, సలీం భాయ్, సిల్వర్ మనీష్, కృష్ణ గౌడ్, సాయన్న, అంజద్, అమ్ము, మురళి, అరుణ, పూజ, పద్మ, మోహిని, సత్య రెడ్డి, శంకర్రావు, రమణ గౌస్, బాయ్ పాల్గొన్నారు.