నమస్తే శేరిలింగంపల్లి: గడ్డుకాలంలో భారతీయ జనతా పార్టీని భుజస్కంధాలపై వేసుకొని నిరంతరం పార్టీ కోసం శ్రమించిన వ్యక్తి జ్ఞానేంద్ర ప్రసాద్ అని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవి కుమార్ యాదవ్ అన్నారు. జ్ఞానేంద్ర ప్రసాద్ ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయన ఆత్మకు శాంతి చేగురాలని కోరుతూ నివాళులర్పించారు.
అనంతరం సేవా భారతి విద్యార్థిని, విద్యార్థులకు పుస్తకాల పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. మాజీ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి, ఎల్లేష్, రాధాకృష్ణ యాదవ్, హాఫిజ్ పేట్ డివిజన్ అధ్యక్షులు శ్రీధర్ గౌడ్, మియాపూర్ డివిజన్ అధ్యక్షులు మాణిక్ రావు, రవి గౌడ్, ఆకుల లక్ష్మణ్, పృథ్వీ గౌడ్, గణేష్ ముదిరాజ్, అశోక్, శ్రీనివాస్ యాదవ్, రామకృష్ణారెడ్డి, విద్యా కల్పన గౌడ్, జగన్ గౌడ్ పాల్గొన్నారు.