మట్టి వినాయక విగ్రహాల పంపిణీకి ముందుకొచ్చిన మాజీ కార్పొరేటర్ శ్రీకాంత్

శేరిలింగంప‌ల్లి, సెస్టెంబ‌ర్ 11 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మియాపూర్ డివిజ‌న్ మాజీ కార్పొరేటర్ శ్రీకాంత్‌ను జై గణేశ భక్త సమితి రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన జి. రోహిత్ ముదిరాజ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన రోహిత్ ముదిరాజ్‌కు శ్రీకాంత్ అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మట్టి వినాయక విగ్రహాల ప్రాధాన్యతపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేసేందుకు తాను సహకరిస్తానని శ్రీకాంత్ తెలిపారు. ఇందులో భాగంగా సుమారు 1,000 మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. మట్టి వినాయకుల ప్రోత్సాహానికి ముందుకొచ్చిన శ్రీకాంత్‌కు జి. రోహిత్ ముదిరాజ్ కృతజ్ఞతలు తెలిపారు. తక్కువ సమయంలోనే సానుకూలంగా స్పందించి సహకారం అందించేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here