నమస్తే శేరిలింగంపల్లి: బక్షి కుంట చెరువును స్వచ్చమైన మంచి నీటి చెరువుగా తీర్చిదిద్దడమే ధ్యేయమని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. చందానగర్ డివిజన్ పరిధిలోని రాజేందర్ రెడ్డి నగర్ కాలనీలోని బక్షి కుంట చెరువు సుందరికరణలో భాగంగా ఫెనోమ్ పీపుల్ ఐటీ కంపెనీ సీఎస్ ఆర్ ఫండ్స్ ద్వారా బైరీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా చేపడుతున్న పనులను డీసీ వంశీ కృష్ణ, కార్పొరేటర్లు మంజుల రఘునాథ్ రెడ్డి, ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి పరిశీలించారు.

ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ బక్షి కుంట చెరువుకు దశ దిశ మారినది అని, ఎన్నో ఏండ్ల సమస్య నేటి తో తిరునని, శాశ్వత పరిష్కారం దిశగా చెరువును అభివృద్ధి చేపట్టామని చెప్పారు. నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని, త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తీసుకురావాలని అధికారులకు ఆదేశించారు. చెరువులను సంరక్షణిచడమే ధ్యేయంగా పనిచేస్తున్నామని పేర్కొన్నారు. అదేవిధంగా మెడికుంట చెరువును సుందరవనంగా, శోభితవర్ణంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ ఎంసీ అధికారులు ఎస్ ఈ శంకర్ నాయక్, ఈఈ శ్రీకాంతిని డిఈ దుర్గాప్రసాద్, ఏ ఈ సంతోష్ రెడ్డి , ఇరిగేషన్ అధికారులు డిఈ నళిని , ఏఈ పావని, చందానగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రసాద్ , సందీప్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, కాలనీ వాసులు పాల్గొన్నారు.






