మహిషాసురమర్ధనిగా భవానీ అమ్మ‌వారు

చందానగర్ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): చందాన‌గ‌ర్‌లోని విశాఖ శ్రీ శారదా పీఠ పాలిత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ సముదాయంలోని శ్రీ భవానీ ఆలయంలో దేవీ న‌వ‌రాత్రి ఉత్స‌వాలు ఘ‌నంగా కొన‌సాగుతున్నాయి. 8వ రోజు అమ్మ‌వారిని శ్రీ మహిషాసురమర్ధని స్వరూపిణిగా అలంకరించారు. అమ్మ‌వారికి సుప్రభాత హారతి, శ్రీచక్రార్చన, శ్రీచక్రాభిషేకం నిర్వ‌హించారు. ప‌రిస‌ర ప్రాంతాల‌కు చెందిన భ‌క్తులు అమ్మ‌వారిని ద‌ర్శించుకుని తీర్థ ప్ర‌సాదాల‌ను స్వీక‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆలయ ప్రధాన అర్చకుడు సత్యసాయి, భవానీ ఆలయ అర్చకుడు రవిశర్మ, పాలక మండలి సభ్యులు, దేవాలయ సేవాసమితి సభ్యులు పాల్గొన్నారు.

మహిషాసురమర్ధనిగా ద‌ర్శ‌న‌మిస్తున్న‌ భవానీ అమ్మ‌వారు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here