హఫీజ్ పేట్ (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని సాయినగర్, మదీనాగూడలో వరద ముంపుకు గురైన బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసిన రూ.10వేల సహాయాన్ని కార్పొరేటర్ వి.పూజిత జగదీశ్వర్ గౌడ్ అందజేశారు. ప్రజలను అన్ని విధాలుగా ఆదుకుంటామని, ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా సహాయం అందిస్తామని ఆమె తెలిపారు. ఆమె వెంట స్థానిక నాయకులు, జీహెచ్ఎంసీ అధికారులు ఉన్నారు.






