- యువతకు క్రికెట్ పంపిణి
నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని ఎం ఏ నగర్, న్యూ కాలనీ, స్టాలిన్ నగర్ కాలనీల యూత్ సభ్యులకు మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ సహకారంతో క్రికెట్ కిట్లను పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్పొరేటర్ నార్నే శ్రీనివాస్ రావు తో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ యువతకు కిట్లను పంపిణి చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ యువత క్రికెట్ కిట్లను సద్వినియోగం చేసుకుంటూ .. ప్రతిభ, నైపుణ్యత సామర్థ్యాలను వెలికి తీసి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని పేర్కొన్నారు. ప్రతిభ కు పేదరికం అడ్డుకాదని, క్రీడలతో శారీరక శ్రమతో పాటు మానసిక ఉల్లాసం పెంపొందుతుందని తెలిపారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాధవరం రంగరావు, వివేకానంద నగర్ డివిజన్ బీఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు సంజీవ రెడ్డి, చందానగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు గొట్టిముక్కల పెద్ద భాస్కర్ రావు, నాయి నేని చంద్రకాంత్ రావు, కార్తిక్ రావు, కాశినాథ్ యాదవ్, వెంకటేష్ , శివ ముదిరాజ్, నాగరాజ్ యాదవ్, నరేష్ , పాండు, చందు, రఘునాథ్ పాల్గొన్నారు.