వ‌ర‌ద బాధితుల‌కు అండ‌గా ఉంటాం

  • కార్పొరేట‌ర్ వి.పూజిత జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్

హ‌ఫీజ్‌పేట‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): వ‌ర‌ద బాధితుల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం అండ‌గా ఉంటుంద‌ని హ‌ఫీజ్‌పేట డివిజ‌న్ కార్పొరేట‌ర్ వి.పూజిత జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్ అన్నారు. వ‌ర‌ద బాధితుల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన రూ.10వేల ఆర్థిక స‌హాయాన్ని ఆమె మాదాపూర్ డివిజ‌న్ కార్పొరేట‌ర్ జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్‌తో క‌లిసి బుధ‌వారం డివిజ‌న్ ప‌రిధిలోని జనప్రియ అపార్ట్‌మెంట్‌, రామకృష్ణ నగర్ వాసుల‌కు పంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ.. డివిజన్ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి కృషి చేస్తున్నామ‌ని తెలిపారు. లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో జీహెచ్ఎంసీ డీఈ రూపాదేవి, ఏఈ అనురాగ్, నాయ‌కులు బాలింగ్‌ గౌతమ్ గౌడ్, శాంతయ్య, వాలా హరీష్ రావు, విష్ణు, గవాస్కర్, పద్మ, మాధవి తదితరులు పాల్గొన్నారు.

వ‌ర‌ద బాధితుల‌కు రూ.10వేలు అంద‌జేస్తున్న కార్పొరేట‌ర్లు పూజిత, జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్
వ‌ర‌ద బాధితుల‌కు రూ.10వేలు అంద‌జేస్తున్న కార్పొరేట‌ర్లు పూజిత, జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here