- అగ్ని ప్రమాదాలు, నిబంధనలు అవగాహన కార్యక్రమంలో జోనల్ జాయింట్ కమిషనర్ మల్లారెడ్డి , జంట సర్కిళ్ల డిప్యూటి కమిషనర్లు వెంకన్న, సుధాంషు
నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ సర్కిల్ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కళ్యాణ మండపంలో అగ్నిప్రమాదాల నివారణ, నిబంధనలు, తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గత నెలలో జరిగిన శాంపిల్ సర్వే లో సందర్శించిన వ్యాపార భవన సముదాయ సభ్యులను ఉద్దేశించి జోనల్ జాయింట్ కమిషనర్ మల్లారెడ్డి , జంట సర్కిళ్ల డిప్యూటి కమిషనర్లు వెంకన్న, సుధాంషు మాట్లాడారు.
15 రోజుల్లో అగ్ని ప్రమాదాలకు సంబంధించి తగిన చర్యలు తీసుకుంటామని, సంబంధిత శాఖల అధికారులతో తనిఖీలు చేపట్టి, నిర్ధారణ చేసి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. వ్యాపార వాణిజ్య యజమానులు, భవన యజమానులు నిబంధనలు పాటిస్తామని స్వీయ డిక్లరేషన్ ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏ సిపి మెహ్రా, ఏ సిపి సంపత్, సిఐ తిరుపతి రావు, ఏడీఎఫ్ఓ , డాక్టర్ కార్తీక్, ఏఎంహెచ్ఓ, అధికారులు, వ్యాపార భవన సముదాయ యజమానులు, వ్యాపారులు పాల్గొన్నారు.