- కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి
చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ పరిధిలో ప్రమాదకరంగా ఉన్న సెల్లార్ గుంతలను వెంటనే పూడ్చాలని కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి అన్నారు. మంగళవారం ఆమె చందానగర్ డివిజన్ పరిధిలోని సాయిరాఘవ అపార్ట్మెంట్స్ వద్ద ఏసీపీ తులసిరామ్, అపార్ట్మెంట్స్ వాసులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సెల్లార్ తీసి నిర్లక్ష్యంగా వదిలివేసిన బిల్డర్ పై చర్యలు తీసుకోవాలన్నారు. సాయిరాఘవ అపార్ట్మెంట్స్ ప్రహరీ గోడ పక్కన భవన నిర్మాణం కోసం సెల్లార్ గుంత తీసి అలాగే వదిలి వేశారని, దీంతో నీరు నిండి అపార్ట్మెంట్స్ ప్రహరీ గోడ కూలిపోయిందని అన్నారు. సెల్లార్ తీసి నిర్లక్ష్యంగా వదిలివేసిన బిల్డర్ పై చర్య తీసుకొని అపార్ట్మెంట్స్ వాసులకు తిరిగి బిల్డర్ ప్రహరీ గోడ నిర్మించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. వెంటనే అపార్ట్మెంట్స్ కు ప్రమాదం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.







