- కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి
చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): వరద నీటి వలన పేరుకుపోయిన మట్టిని, బురదని వెంటనే తొలగించాలని కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి అన్నారు. మంగళవారం చందానగర్ డివిజన్ పరిధిలోని సత్యనారాయణ ఎన్క్లేవ్ అపార్ట్మెంట్ లో ఆమె పర్యటించారు. వరద నీటి వలన రోడ్లపై పేరుకుపోయిన బురద, మట్టిని బాబ్ కాట్ ద్వారా తొలగింప చేయించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ వరద వలన వచ్చిన బురద, మట్టి వలన వాహనదారులు పడిపోవడం జరుగుతుందని, బాటసారులు ఇబ్బంది పడుతున్నారని, దోమలు వృద్ధి చెంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, కనుక పేరుకుపోయిన ఉన్న మట్టిని, బురదని వెంటనే తొలగించాలని కార్పొరేటర్ అన్నారు.