గచ్చిబౌలి (నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపన్‌పల్లిలో బీజేపీ నాయకుడు మట్ట సురేష్ ఆధ్వర్యంలో సోమవారం మహిళలకు బయో డీగ్రేడబుల్ శానిటరీ ప్యాడ్లను పంపిణీ చేశారు. ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన జన ఔషధి – సువిధ స్కీంలో భాగంగా పేద మహిళలకు శానిటరీ ప్యాడ్లను పంపిణీ చేయడం జరిగిందని ఈ సందర్భంగా మట్ట సురేష్ తెలిపారు. అలాగే మహిళలకు తమకు వస్తున్న ఫించన్లు, వారి జన్ ధన్ ఖాతాలకు చెందిన సమస్యలు తదితర అంశాలపై ఆయన మహిళలతో చర్చించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.







