ఉచిత వైద్య సేవలు అభినందనీయం : ప్రభుత్వ విప్ ఆరెక పూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ డివిజన్ పరిధిలోని చంద్రనాయక్ తాండలో ఆగర్వాల్ సమాజ్ దుర్గం చెరువు శాఖ, అగర్వాల్ సేవ దళ్, బద్రీవిశాల్ పన్నలాల్ పిట్టి ట్రస్ట్ ఆధ్వర్యంలో మెడికవర్ హాస్పిటల్ సౌజన్యంతో ఉచిత మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావుతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెక పూడి గాంధీ ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు.

ఆగర్వాల్ సమాజ్ దుర్గం చెరువు శాఖ, అగర్వాల్ సేవ దళ్, బద్రీవిశాల్ పన్నలాల్ పిట్టి ట్రస్ట్ ఆధ్వర్యంలో చంద్రనాయక్ తాండలో నిర్వహించిన వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆరెక పూడి గాంధీ

ఉచిత మెగా మెడికల్ క్యాంప్ ను నిర్వహించడం అభినదించదగ్గ విషయమన్నారు. ఇక్కడి పరిసర ప్రాంతంలో ఉచిత వైద్య సేవలు అందించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. సుమారుగా 2000 మందికి పైగా ఉచిత వైద్య సేవలు అందించారని, ECGతో సహా అన్ని రకాల వైద్య ఉచిత పరీక్షలు నిర్వహించిన నిర్వాకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు చిన్న మధుసూదన్ రెడ్డి, లాలూ నాయక్, ఉన్య నాయక్, బాలు, రాజశేఖర్, అగర్వాల్ సమాజ్ దుర్గం చెరువు శాఖ ప్రెసిడెంట్ సురేష్ మిట్టల్, వైస్ ప్రెసిడెంట్ హేమంత్ గుప్తా, సెక్రటరీ సంజీవ్ కుమార్ గుప్తా, జాయింట్ సెక్రటరీ అపూర్వ మురర్కా, ట్రెజరర్ కృష్ణ గార్గ్, అడ్వైజర్ వినయ్ అగర్వాల్, విశంబర్ అగర్వాల్, సందీప్ గుప్తా, అనిల్ గుప్తా, నరేందర్ అగర్వాల్, రవి సింగనియా, రాజకుమార్ అగర్వాల్, మంజరి అగర్వాల్, రీనా గుప్తా, అనిత గుప్తా, విమల గార్గ్, బద్రీవిషాల్ పన్నలాల్ పిట్టి ట్రస్ట్ సభ్యులు (అగర్వాల్ సేవ దళ్) రతన్ గుప్తా, సంజయ్ పసరి, వినయ్ అగర్వాల్, ప్రదీప్ అగర్వాల్, సుధీర్ గుప్తా, సురేందర్ గోయల్, కైలాష్ కెడియా, ఊర్మిల అగర్వాల్ మరియు మెడి కవర్ హాస్పిటల్ వైద్యలు డాక్టర్ మంటియా సేథ్, మిట బజాజ్, అవినాష్ మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

వైద్య శిబిరాన్ని ప్రారంభించిన అనంతరం వైద్య సిబ్బంది, కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావుతో ప్రభుత్వ విప్ ఆరెక పూడి గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here