శేరిలింగంపల్లి(నమస్తే శేరిలింగంపల్లి): నేతాజీ నగర్ కాలనీలో ప్రతి సమస్యను స్థానిక నాయకులు, అధికారుల సహకారంతో పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు భేరీ రాంచందర్ యాదవ్ అన్నారు. గత మూడు రోజులుగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పొంగిపొర్లుతుండటంతో స్థానిక ప్రజలు ఇబ్బంది పడుతున్న విషయాన్ని రాంచందర్ యాదవ్ అధికారుల దృష్టికి తీసుకు వెళ్లడంతో అధికారులు స్పందించగా శానిటేషన్ సూపర్వైజర్ భరత్, సిబ్బంది రాజేష్, గోపాల్ లు డ్రైనేజీ సమస్యను పరిష్కరించారు. ఈ సందర్భంగా రాంచందర్ యాదవ్ మాట్లాడుతూ కాలనీ వాసులు ఎదుర్కొంటున్న సమస్యలను వెనువెంటనే అధికారుల దృష్టికి తీసుకువెళ్తున్నానని తెలిపారు. సత్వరమే స్పందించి సమస్యలను పరిష్కరిస్తున్న అధికారులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.