బిటి రోడ్డు పనుల్లో నాణ్యత పాటించాలి : కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్

నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని హెచ్ఎంటి స్వర్ణ పూరి కాలనీలో నూతనంగా నిర్మిస్తున్నబిటి రోడ్డు పనులను జిహెచ్ఎంసి అధికారులు, స్ధానిక నాయకులు , కాలనీ వాసులతో కలసి మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని , నాణ్యత విషయంలో ఎక్కడ రాజి పడకూడదని అధికారులను ఆదేశించారు. మియాపూర్ డివిజన్ అభివృద్ధికి ప్రభుత్వ విప్ ఆరె కపూడి గాంధీ సహకారంతో శాయశక్తులా కృషి చేస్తానని, అన్నివేళలా ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు దేవేందర్, దశరథ్ రావు, విరూపాక్షాయ ,రాజేష్, శ్రీను , పాల్గొన్నారు.

హెచ్ఎంటి స్వర్ణ పూరి కాలనీలో నూతనంగా నిర్మిస్తున్నబిటి రోడ్డు పనులను పరిశీలిస్తున్న కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here