పర్యావరణ ప్రేమికుడు ప్రభుత్వ విప్ గాంధీ: మిద్దెల మల్లారెడ్డి

మిద్దెల మల్లారెడ్డి ఇచ్చిన మొక్కను తన నివాస ప్రాంగణంలో నాటుతున్న ప్రభుత్వ విప్ గాంధీ

చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి శాసనసభ్యులు ఆరెకపూడి గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని శేరిలింగంపల్లి టీఆర్ఎస్ సీనియర్ నాయకులు మిద్దెల మల్లారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి అందజేసిన మొక్కను అరికెపూడి గాంధీ వారి నివాస ప్రాంగణంలో నాటారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ ప్రజా సంక్షేమంతో పాటు పర్యావరణ పరిరక్షణ లో ప్రభుత్వ విప్ గాంధీ ప్రత్యేక శ్రద్ధ చూపుతారని, వారి జన్మదిన వేళ స్వయంగా ఆయన చేతులమీదుగా మొక్కను నాటించడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డు చైర్ పర్సన్ రాగం సుజాత యాదవ్, కార్పొరేటర్లు బొబ్బ నవత రెడ్డి, రాగం నాగేందర్ యాదవ్, హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండా విజయ్ కుమార్, టిఆర్ఎస్ హఫీజ్ పేట్ డివిజన్ అధ్యక్షులు బాలింగ్ గౌతమ్ గౌడ్, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు చాంద్ పాష తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ విప్ గాంధీకి పూల మొక్కను అందజేస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్న మిద్దెల మల్లారెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here