నమస్తే శేరిలింగంపల్లి: గిరిజనులకు సీఎం కేసీఆర్ అన్యాయం చేస్తున్నారని బీజేపీ గిరిజన మూర్ఛ అర్బన్ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి జగదీష్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఓ ప్రకటనలో తీవ్రంగా విమర్శించారు. సెప్టెంబర్ 17న గిరిజనులతో సమావేశమైన సీఎం కేసీఆర్ గిరిజనులకు 6 శాతం ఉన్న రిజర్వేషన్లను 10 శాతం వారం రోజులో పెంచుతా అని హామీ ఇచ్చి 10 రోజులు కావొస్తున్న ఇప్పటికి పెంచడం లేదని, ఎందుకు పెంచడం లేదో గిరిజనులు ప్రశ్నించేందుకు సిద్ధంగా ఉన్నారని, రిజర్వేషన్లు పెంచడంలో ఆలస్యం చేస్తే గిరిజన సమాజం సీఎం కేసీఆర్ ను మాట తప్పిన వ్యక్తిగా పరిగణలోకి తీసుకుంటుందని తెలిపారు. తక్షణమే జీవో విడుదల చేసి 10% శాతం గిరిజన రిజర్వేషన్లని గ్రూప్-1 పోలీస్ రిక్రూట్మెంట్ ఇతర ఉద్యోగ నోటిఫికేషన్ లలో తక్షణమే అమలు లోకి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని బీజేపీ గిరిజన మూర్ఛ డిమాండ్ చేసిందని పేర్కొన్నారు. గిరిజనులకు పోడు భూముల సమస్యలను పరిష్కరించి ఆదుకోవాలని కోరారు. తాండలను గ్రామపంచాయతీలో గుర్తించిన దానిని రెవెన్యూ గ్రామపంచాయతీలుగా ఎందుకు గుర్తించలేదో తెలపాలని ప్రశ్నించారు.