వృద్ధురాలు అదృశ్యం

నమస్తే శేరిలింగంపల్లి:  పాలు తేవడానికి బయటికి వెళ్ళిన వృద్ధురాలు అదృశ్యమైన సంఘటన శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలో చోటు చేసుకున్నది. వివరాలు.. నాగమణి (57) తన ఇద్దరు కుమారులతో కలిసి చందానగర్లో నివసిస్తున్నారు. నాగమణి భర్త సత్య నారాయణ (60) తరచూ ఆమెతో గొడవ పడేవాడు, అసభ్య పదజాలంతో దూషించేవాడు. దీంతో 2011వ సంవత్సరంలో తన కుమారులు (రమేష్, శ్రీనివాస్)తో కలిసి బయటికి వచ్చి చందానగర్లో వచ్చి ఉంటున్నారు. తన తండ్రి తరచూ తన తల్లితో గొడవ పడేవాడని, అక్రమ సంబంధం అంటగట్టేవాడని, తనపై కూడా గొడవ పడేవాడని నాగమణి కుమారుడు రమేష్ తెలిపాడు. రమేష్ సాప్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. అయితే తన తల్లి ఎప్పటిలాగే సాయంత్రం పలు తేవడానికి ఇంటికి బయటినుంచి తాళం వేసి వెళ్ళింది. రమేష్ వెనుక డోర్ నుంచి వచ్చి తాళం తీసాడు.. తన తల్లి ఎంతకీ రాకపోవడంతో చుట్టుపక్కల వెతికాడు, ఆచూకీ లభించలేదు. వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here