నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి అసెంబ్లీ , చందానగర్ డివిజన్ బీజేపి అధ్యక్షులు గొల్లపల్లి రాంరెడ్డి ఆద్వర్యంలో నేడు పండిట్ దీన్ దయాల్ 106వ జయంతి సందర్భంగా తార నగర్ బతుకమ్మ కుంట లో మొక్కలు నాటి , వారి చిత్రపటానికి పూలమాల వేసి ఆ మహనీయునికి నివాళులర్పించారు. బీజేపీ నాయకులు పోరెడ్డి బుచ్చిరెడ్డి మాట్లాడుతూ ఏకాత్మ మానవతావాదం ప్రతిపాదించి , సమాజంలో అట్టడుగున ఉన్న వ్యక్తికే ప్రభుత్వ పథకాల మొదటి ప్రయోజనం చేకూరాలన్న అంత్యోదయ భావనను రూపొందించిన మహోన్నత వ్యక్తి , జన్ సంఘ్ వ్యవస్థాపకుడు పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ అని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపి జిల్లా అధికార ప్రతినిధి మారం వెంకట్ , బీజేపి సీనియర్ నాయకులు చిన్నం సత్యనారాయణ , బీజేపి జిల్లా కార్యవర్గ సభ్యులు గొల్లపల్లి శ్రీనివాస్ రెడ్డి, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి కైతాపురం జితేందర్ , బీజేపి డివిజన్ ఉపాధ్యక్షులు వేణు గోపాల్ , బీజేవైఎం డివిజన్ అధ్యక్షులు మల్లేష్ గౌడ్, బీజేవైఎం నాయకులు సందీప్, సాయి మురళి పాల్గొన్నారు.