నమస్తే శేరిలింగంపల్లి : నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర రెండవ రోజు శేరిలింగంపల్లి నియోజకవర్గానికి విచ్చేస్తున్న సందర్భంగా ఆల్బెస్టాస్ కాలనీలో శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని రాష్ట్ర, జిల్లా, సీనియర్ నాయకులు, డివిజన్ నాయకులు, కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు, కాలనీ వాసులు, స్థానిక నేతలు, కార్యకర్తలతో కలిసి బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుబండి సంజయ్ కి మాజీ పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రాష్ట్ర బిజెపి నాయకులు రవి కుమార్ యాదవ్, గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ కేసీఆర్ కుటుంబం వాటాలు అడుగుతుండడంతో పరిశ్రమలన్నీ పక్క రాష్ట్రాలకు తరలి పోతున్నాయి. రెండు మూడు ఫ్లైఓవర్లు కట్టి హైదరాబాద్ అభివృద్ధి అంటున్నారు, కానీ చిన్న వాన పడితే చాలు డ్రైనేజీలు పొంగి పొర్లు తున్నాయి. కార్యక్రమంలో మాదాపూర్ కంటెస్టెంట్ కార్పొరేటర్ రాధాకృష్ణ యాదవ్, శేరిలింగంపల్లి డివిజన్ బీజేపీ కంటెస్టెడ్ కార్పొరేటర్ కంచర్ల ఎల్లేష్, రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, రంగారెడ్డి జిల్లా అర్బన్ కార్యదర్శి వరలక్ష్మి ధీరజ్, గచ్చిబౌలి డివిజన్ వైస్ ప్రెసిడెంట్ శివ సింగ్, తిరుపతి, బీజేపీ ప్రముఖులు, సీనియర్ బిజెపి నాయకులు శంఖేష్ సింగ్ శంఖేష్ సింగ్ అరవింద్ సింగ్, దేవేందర్ గోపాల్, జితేందర్ సింగ్ , శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని రాష్ట్ర, జిల్లా, సీనియర్ నాయకులు, డివిజన్ నాయకులు, మహిళా నాయకురాలు, కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు, కాలనీ వాసులకు, స్థానిక నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.