కల్యాణ మండపాన్ని పునరుద్ధరించాలి – బీజేపీ రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ 

నమస్తే శేరిలింగంపల్లి : చందానగర్ డివిజన్ లో నిరుపయోగంగా ఉన్న మున్సిపల్ కల్యాణ మండపాన్ని స్థానికుల విజ్ఞప్తి మేరకు బీజేపీ రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 1992లో అప్పటి మున్సిపల్ చైర్మన్ గా ఉన్న మా నాన్న పేద లకోసం ఈ కళ్యాణ మండపానికి భూమి కేటాయించారు. 1997లో జనార్ధన్ రెడ్డి కోటి రూపాయల నిధులు వెచ్చించి నిర్మించారు. ప్రస్తుతం నిరుపయోగంగా ఉందని, రెండు సంవత్సరాల నుంచి ఎలాంటి శుభకార్యాలు జరగడం లేదన్నారు. జిహెచ్ఎంసి కార్యాలయం వాహనాలు, ఇతర పనుల కోసం వచ్చే వారి వాహనాలను ఇక్కడే నిలపడం, వ్యర్థ పదార్థాలను డంపింగ్ చేయడం వల్ల కల్యాణ మండపం అధ్వాన పరిస్థితికి వచ్చింది.

మున్సిపల్ కల్యాణ మండపాన్నిసందర్శించి సమస్యను పరిశీలిస్తున్న బీజేపీ రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్

నిర్వహణ కరువవడంతో వర్షపు నీరు పడి భోజనశాలలో ఫ్లోరింగ్ కుంగిపోయింది, లైట్లు, ఫ్యాన్లు పనిచేయడం లేదు, స్విచ్ బోర్డులు విరిగిపోయాయి. నేడు నియోజకవర్గ ప్రజలు ఇంట్లో ఏదైనా శుభకార్యం జరుపుకోవాలంటే ప్రైవేటు కల్యాణమండపాలు ఆశ్రయిస్తూ జేబులు ఖాళీ చేసుకుంటున్నారని , తక్షణమే ఈ కల్యాణ మండపాన్ని పునరుద్ధరించి వాడుకలో తీసుకురావాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బొబ్బ నవతా రెడ్డి, కసిరెడ్డీ రఘునాథ్ రెడ్డి, కంచర్ల ఎల్లేష్, రమేష్, శివ కుమార్, అర్జున్, విజయ్, మహేష్ పాల్గొన్నారు.

మున్సిపల్ కల్యాణ మండపాన్నిసందర్శించిన అనంతరం సమస్య ఉధృతిని తెలుసుకుంటున్న రవికుమార్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here