రాయదుర్గం పీఎస్ పరిధిలో యువతి అదృశ్యం

నమస్తే శేరిలింగంపల్లి : అమ్మమ్మ ఇంటికి వెళ్లిన యువతి అనంతరం అదృశ్యమైన సంఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని మణికొండలో చోటుచేసుకున్నది. యువతి అమ్మమ్మ, మేనమామ తెలిపిన వివరాల ప్రకారం.. పోలవరంపు జాహ్నవి తన స్వగ్రామములో దుర్గాప్రసాద్ అనే వ్యక్తి ప్రేమలో పడింది. ఇది తెలిసి తన తల్లి దండ్రులు వారం రోజుల క్రితము యువతిని మనికొండలో నివాసముడే తన అమ్మమ్మ ఇంటికి పంపించారు. అయితే అందాజా ఎప్పటిలాగే మంగళవారం ఉదయం 8:30 గంటలకు బయట ఇండ్లలో పనికి వెళ్లి తిరిగి 11:00 గంటలకు ఇంటికి వచ్చింది. ఆ సమయంలో జాహ్నవి ఇంట్లో లేకపోవడంతో తన పెద్దకొడుకును అడగగా.. సాయిబాబా రెసిడెన్సీలోని తన అత్త ధానేశ్వరి పనిచేసే దగ్గరికి వెళ్లొస్తానని చెప్పిందన్నాడు.

అదృశ్యమైన యువతి జాహ్నవి

వెంటనే వారిద్దరూ దానేశ్వరి పనిచేసే చోటికి వెళ్ళి చూడగా కనిపించకపోవడంతో చుట్టుపక్కల, బందువుల, స్నేహితుల దగ్గర విచారించగా ఎలాంటి ఆచూకీ లభించలేదు. దుర్గాప్రసాద్ పై అనుమానం వ్యక్తచేస్తూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here