ప్రభుత్వ విప్ అరికెపూడి గాంధీని కలిసి వినతిపత్రం సమర్పించిన కాలనీవాసులు
నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని సాయి వైభవ్ కాలనీలో సమస్యలు పరిష్కరించి చేపట్టాల్సిన అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని కోరుతూ.. కాలనీవాసులు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీని వివేకానంద నగర్ లోని తన నివాసంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. అసంపూర్తిగా మిగిలిపోయిన సీసీ రోడ్లను పూర్తి చేయాలని, ఇతర మౌలిక వసతులు కల్పించాలని వినతి పత్రంలో పేర్కొన్నట్లు తెలిపారు . ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ కాలనీలో అసంపూర్తిగా మిగిలిపోయిన సీసీ రోడ్ల ను త్వరలోనే వేయిస్తామని, కాలనీలో నెలకొన్న సీసీ రోడ్లు, డ్రైనేజి, వీధి దీపాల వంటి సమస్యల ను త్వరలోనే పరిష్కరిస్తానని తెలిపారు. సీసీ రోడ్లు, విధి దీపాల ఏర్పాటు కు కృషి చేస్తానని, త్వరలోనే కాలనీ లలో పర్యటిస్తానని విప్ గాంధీ పేర్కొన్నారు. అదేవిదంగా కాలనీల లో అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని, డ్రైనేజీ, రోడ్లు, మంచి నీరు, విద్యుత్ దీపాలు వంటి అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తామని చెప్పారు. అదేవిధంగా కాలనీ వాసులు అందరూ కలిసి కాలనీ అభివృద్ధి లో భాగస్వాములు కావాలని, కాలనీ వాసులందరి కృషి తో ఆదర్శవంతమైన కాలనీలు గా తీర్చిదిద్దుతామని వివరించారు. ఏ చిన్న సమస్య ఐన తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తానని, ఎల్లవేళల అందుబాటులో ఉంటానని ఆయన తెలిపారు. కార్యక్రమంలో సాయి వైభవ్ కాలనీ వాసులు పద్మావతి, రామమూర్తి, పవన్, భరద్వాజ్, అశోక్ రాజు తదితరులు పాల్గొన్నారు.