నమస్తే శేరిలింగంపల్లి: కిడ్ని సమస్యతో బాదపడుతున్న మియాపూర్ మదీనగూడకు చెందిన శ్రీనివాస్ కూతురు టీ మనోజ (22) కుటుంబానికి లయన్స్ క్లబ్ ఆప్ హైదరాబాద్ హోప్ ఆధ్వర్యంలో రూ. 25 వేల నగదును అందజేశారు. గత రెండు సంవత్సారాలుగా కిడ్ని సమస్యతో తీవ్రంగా బాధపడుతున్న మనోజకు లయన్స్ క్లబ్ ఆప్ హైదరాబాద్ హోప్ చేయూతనిచ్చి మంచి ఆరోగ్యాన్ని పొందాలని కొండా విజయ్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ వ్యవస్థాపక ఆద్యక్షుడు కొండ విజయ్, ఆద్యక్షుడు టి మహిపాల్ రెడ్డి, ఉపాధ్యక్షులు బీంరావు, శాంతిభూషణ్ రెడ్డి, లయన్ మారం వెంకట్, లయన్ డాక్టర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.