నమస్తే శేరిలింగంపల్లి: కల్వకుంట్ల కవిత లిక్కర్ స్కాం కి వ్యతిరేకంగా శాంతి యుతంగా ధర్నా చేస్తున్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని యాత్ర స్థలం నుండి బలవంతంగా అరెస్టు చేసి గృహ నిర్భంధం చేయడం పోలీసుల దమన నీతికి నిదర్శనమని బిజెపి శేరిలింగంపల్లి అసెంబ్లీ మహిళ మోర్చా కో-కన్వీనర్ బీమని విజయ లక్ష్మి అన్నారు. గృహ నిర్బందంలో ఉంచిన ఎంపీ, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను శేరిలింగంపల్లి అసెంబ్లీ మహిళ మోర్చ కో-కన్వీనర్ బీమని విజయ లక్ష్మి కలిసి సంఘీభావం తెలపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లిక్కర్ స్కాం లో దొరికిన కల్వకుంట్ల కవితను వదిలేసి శాంతియుతంగా ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్న బండి సంజయ్ ను అరెస్ట్ చేయడం కేసీఆర్ కుటిల బుద్ధికి, అసహనానికి నిదర్శనం అన్నారు. రాష్ట్రం లో బిజెపి ఎదుగుదల చూడలేక దొర మతి స్థిమితం తప్పి ఇలా ప్రవర్తిస్తున్నాడని చెప్పారు. రాష్ట్రాన్ని దోచుకున్నది సరిపోలేదని కేసీఆర్ కుటుంబం దేశం మీద పడిందని అని ఎద్దేవా చేశారు. బిజెపి కార్యకర్తల పై అక్రమ కేసులు పెడితే సహించే ప్రసక్తే లేదని, న్యాయం కోసం ఎంత దూరమైనా వెళ్తాం అని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కొప్పు బాషా, కాంచన కృష్ణ, బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.