నమస్తే శేరిలింగంపల్లి: మహిళలు స్వయం ఉపాధి సాధించేందుకు చైల్డ్ ఫండ్ ఇంటర్నేషనల్ సంస్థ చేస్తున్న కృషి అభినందనీయమని శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. చైల్డ్ ఫండ్ ఇంటర్నేషనల్ సంస్థ ఆధ్వర్యంలో హుడా కాలనీలోని కార్యాలయంలో మహిళలకు ఉచితంగా కుట్టుమిషన్లను కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ చేతుల మీదుగా అందజేశారు. చైల్డ్ ఫండ్ సంస్థ సహకారంతో కుట్టు మిషన్ లను పొందిన మహిళలకు స్వయం ఉపాధి పొంది సమాజంలో గర్వంగా జీవించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చైల్డ్ ఫండ్ ఇంటర్నేషనల్ సంస్థ సీనియర్ ప్రోగ్రామర్ డాక్టర్ శ్రీశైలం, సీనియర్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ప్రకాష్, వి.దివ్య, ఫీల్డ్ కోఆర్డినేటర్ సంతోష్, చైల్డ్ ఫండ్ సిబ్బంది, రోజా, షబానా కుట్టు మిషన్ లు పొందిన మహిళలు తదితరులు పాల్గొన్నారు.