పాపిరెడ్డి కాలనీ నుంచి లింకు రోడ్డు నిర్మాణం – ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని పాపిరెడ్డి కాలనీ నుండి వయా రైల్వే ట్రాక్ రోడ్డు సమాంతరంగా జోనల్ ఆఫీస్ కు వెళ్లే హెచ్ ఆర్ డీ‌ సీ ఎల్ రోడ్డుకు కలిసే వీలుగా నూతనంగా లింక్ రోడ్డు నిర్మాణం చేపట్టి వాహనదారుల ఇబ్బందులు తీర్చనున్నట్లు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. పాపిరెడ్డి కాలనీ నుండి వయా రైల్వే ట్రాక్ రోడ్డు సమాంతరంగా జోనల్ ఆఫీస్ కు వెళ్లే హెచ్ ఆర్ డీ సీ ఎల్ రోడ్డుకు కలిసే వీలుగా నూతనంగా లింక్ రోడ్డు నిర్మాణం కోసం జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం అధికారులతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పరిశీలించారు.

పాపిరెడ్డి కాలనీ నుంచి హెచ్ ఆర్ డీ సీ ఎల్ రోడ్డు వరకు లింకు రోడ్డు నిర్మాణానికి అధికారులతో కలిసి పరిశీలించిన ప్రభుత్వ విప్‌ గాంధీ

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లింక్ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. వర్షకాలంలో లింగంపల్లి బ్రిడ్జి వద్ద రోడ్డు దాటేందుకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, దాని ప్రత్యామ్నాయ మార్గాలను ఆలోచిస్తూ అదనంగా ప్రజా సౌకర్యార్థం లింక్ రోడ్డు నిర్మాణం చేపట్టడం జరుగుతుందని అన్నారు. రవాణా సౌకర్యార్థం ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ప్రత్యామ్నాయ రోడ్డును నిర్మించేలా తగిన చర్యలు తీసుకోవాలని, పనులు త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. లింక్ రోడ్డు ఇక్కడి పరిసర ప్రాంత ప్రజలకు, కాలనీ వాసులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఈఈ శ్రీనివాస్, ఏఈ సునీల్, శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షుడు మారబోయిన రాజు యాదవ్, మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, ప్రధాన కార్యదర్శి చింతకింది రవీందర్ గౌడ్, టీఆర్ఎస్ నాయకులు పొడుగు రాంబాబు, పద్మారావు, కొండల్ రెడ్డి, వేణు గోపాల్ రెడ్డి, రమేష్, రమణయ్య, లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here