ట్విట్టర్ లో అడిగిన ప్రజా ప్రశ్నలకు స్పందించకపోవడం విడ్డూరం – టీపీసీసీ నాయకులు శామ్యూల్ కార్తీక్

నమస్తే శేరిలింగంపల్లి: ట్విట్టర్ వేదికగా #askKTR అంటూ అట్టహాసంగా ఈ నెల 5 వ తేదీన చేపట్టిన ఆన్ లైన్ ప్రత్యేక కార్యక్రమంలో ప్రజా సమస్యలపై అడిగిన ప్రశ్నలకు స్పందించకపోవడం కేటీఆర్ అహంకారానికి నిదర్శనమని శేరిలింగంపల్లి డివిజన్ కాంటెస్టెడ్ కార్పొరేటర్, టీపీసీసీ నాయకులు శామ్యూల్ కార్తీక్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ కు సంబంధించిన పొగడ్తలకు, కుశల పలకరింపులు మాత్రమే పరిమితమవ్వడం బాధాకరం అని తెలిపారు. ముఖ్యంగా ప్రతిపక్ష నాయకులు, ప్రజా సమస్యలు ప్రజలకు ఇచ్చిన హామీలపై అడిగిన ప్రశ్నలను కనీసం పరిగణలోనికి తీసుకోకపోడం అహంకారానికి నిదర్శనం అన్నారు. రూ. 3116 నిరుద్యోగ భృతి, కాళేశ్వరం ప్రాజెక్ట్ పంపుల ముంపు, రోడ్ల నిర్మాణం, వాటి నిర్వహణ, క్రిస్టియన్ భవన్, మహానగరంలో వరద నీట మునిగిన వారికి ఆర్ధిక సాయం కేవలం బల్దియా ఎన్నికల సమయంలో మాత్రమే చేపట్టారన్నారు. తర్వాత కనీసం పలకరించలేదని, ప్రజలకు సంబందించిన ప్రశ్నలను గాలి వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సబ్బండవర్గాలకు న్యాయం జరగాలంటే కేవలం కాంగ్రెస్ తోనే సాధ్యమని తెలిపారు.

శామ్యూల్ కార్తీక్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here