నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బోనాల పర్వదినోత్సవమని ప్రభుత్వవిప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని లింగంపల్లి గ్రామంలోని శ్రీ పోచమ్మ తల్లి దేవస్థానంలో రేవంత్ ముదిరాజ్ ఆధ్వర్యంలో చేపట్టిన ఫలహారం బండి ఊరేగింపులో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి కొబ్బరి కాయ కొట్టి పలహార బండి ఊరేగింపును ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ అమ్మ వారి దీవెనలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని అమ్మవారిని వేడుకుంటున్నట్లు తెలిపారు. బోనాల నిర్వహణ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో తీసుకెళ్లేందుకు సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు.
ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షుడు మారబోయిన రాజు యాదవ్, వివేకానంద నగర్ డివిజన్ అధ్యక్షుడు సంజీవ రెడ్డి, చందానగర్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రవీందర్ గౌడ్, టీఆర్ఎస్ నాయకులు కృష్ణ యాదవ్, పద్మారావు, నరేందర్ బల్ల, అమిత్, జర్నలిస్టులు కొండా విజయ్ కుమార్, యూ. శేఖర్ సాగర్, పుట్టా వినయ్ కుమార్ గౌడ్, రాజేష్ గౌడ్, మల్లేష్ గౌడ్, నాగరత్నం, శ్రీనివాస్ ముదిరాజ్, అనిల్ కుమార్ ముదిరాజ్, రేవంత్ ముదిరాజ్, హన్మంత్, మహేష్ గౌడ్, సాయి గౌడ్, వికాస్ గౌడ్, ప్రశాంత్, మల్లేష్ యాదవ్, కళ్యాణ్, అర్జున్, అజ్మల్, భాస్కర్, భరత్ గౌడ్, చక్రి, నితీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.