నమస్తే శేరిలింగంపల్లి: కాలనీలో నెలకొన్న సమస్యలను దశల వారీగా పరిష్కరించి అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దేలా కృషి చేస్తానని గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి అన్నారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపన్ పల్లి తండాలో స్థానికులతో కలిసి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి బస్తీ బాట చేపట్టారు. బస్తీ బాటలో పలు సమస్యలను కార్పొరేటర్ దృష్టికి తీసుకువచ్చారు. కాలనీలో మంచి నీరు, డ్రైనేజీ, సీసీ రోడ్లు, వీధి దీపాల పనితీరుపై తనిఖీ చేశారు. గోపన్ పల్లి తండాలో నూతనంగా నిర్మిస్తున్న భుగర్భ డ్రైనేజీ పైప్ లైన్ పనులను కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి పరిశీలించారు. నాణ్యతా విషయంలో ఎక్కడా రాజీ పడకుండా నిర్ణీత సమయంలో డ్రైనేజీ పనులను పూర్తి చేయాలని కార్పొరేటర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వర్క్ ఇన్‌స్పెక్టర్ విశ్వనాధ్, సీనియర్ నాయకులు ప్రభాకర్, దేవేందర్, గోపనపల్లి తండా వాసులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.