ఘనంగా ఆంధ్ర బాలానందం సంఘం 82వ వార్షికోత్సవం

నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ లోని శిల్పారామంలో సాంస్కృతిక ప్రదర్శనలు పలువురిని ఆకట్టుకున్నాయి. వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా 1940 లో స్థాపించిన ఆంధ్ర బాలానందం సంఘం 82 సంవత్సరాల నుండి ఎందరో కళాకారులను లలిత సంగీతం , చిత్ర లేఖన, భరతనాట్య ప్రదర్శనలో శిక్షణ ఇస్తున్నారు. 82వ వార్షికోత్సవాన్ని శిల్పారామంలో నిర్వహించారు. బాలానందం శిష్యులు లలిత సంగీతం, భరతనాట్య ప్రదర్శనలు ఇచ్చి అందరిని ఆకట్టుకున్నారు. లలిత సంగీతంలో శ్రీ కలగా కృష్ణ మోహన్ ఆధ్వర్యం లో  మా తెలుగు తల్లికి, వెన్నెల వెన్నెల, మా చాచా, చూడ కనులకింపు, పలు మాటల భాషలు తదితర పాటలను రామ సృజన, లహరి, అలేఖ్య, అభినవ్, వైష్ణవి, లాస్య, అనురాగ్ ఆలపించారు.

బద్రీనాథ్ ఆధ్వర్యంలో కళాకారులు భరతనాట్య ప్రదర్శన ఇచ్చారు. వినాయక స్తుతి, జయ జయ ప్రియా భారతి, కీర్తన, రుద్ర స్తుతి, కోలాటం సాంగ్, తిల్లాన అంశాలను వైష్ణవి, పూర్వజా, శ్రావణి, రాఖి, శ్వేతా, శివాని, గ్రీష్మ, గీతికా ,శ్రీవల్లి, తేజస్విని తదితరులు పాల్గొన్నారు. కళాబ్రహ్మ వంశీ రామరాజు, చొక్కాపు వెంకట రమణ, డాక్టర్ చిత్తరంజన్, బాలానందం అధ్యక్ష కార్యదర్శులు కామేశ్వరి హాజరై కళాకారులను అభినందించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here