నమస్తే శేరిలింగంపల్లి: ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం (ఏఐఏవైఎస్) హఫీజ్ పేట్ డివిజన్ అధ్యక్షునిగా కందిసాయి కుమార్ నియామకం అయ్యారు. లక్డీకపూల్ లోని రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన గ్రేటర్ హైదరాబాద్ సమావేశంలో ఏఐఏవైఎస్ జాతీయ కోఆర్డినేటర్ ఎస్. వరుణ్ కుమార్ కందిసాయికుమార్ కు నియామకపు పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సాయికుమార్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ పదవిని అప్పగించేందుకు కృషి చేసిన కర్కనాగరాజు కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానని తెలిపారు. డివిజన్ లో యువజన సంఘం బలోపేతం కోసం కృషి చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు కాడారం విద్యాసాగర్, కోశాధికారి కాడారం వినయ్ కుమార్, రాష్ట్ర కార్యదర్శి మల్లేష్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు కర్కనాగరాజు, ప్రమోద్ కుమార్, శ్రీకాంత్ యాదవ్, గోపి, శ్రీనివాస్ రావ్, రమన్ కుమార్,తదితరులు పాల్గొన్నారు.