నమస్తే శేరిలింగంపల్లి: పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని బాపునగర్, గోపి నగర్ కాలనీలలో అధికారులతో కలిసి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ స్థానిక సమస్యలపై క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ సందర్భంగా పలు సమస్యలను గుర్తించి, తక్షణం మరమ్మతు పనులు చేపట్టాలని సూచించారు. అభివృద్ధి పనులకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించారు. కాలనీలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని, కాలనీవాసుల సహకారంతో డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. కార్పొరేటర్ దృష్టికి ముఖ్యంగా డ్రైనేజీ, మ్యాన్ హోల్, బీటీ, సీసీ రోడ్లు, త్రాగునీటి సమస్యలను తీసుకువచ్చారు. ప్రజల సహకారం తో సంబంధిత శాఖల అధికారులను సమన్వయం చేస్తూ వీలైనంత త్వరగా పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బస్తీ కమిటీ ప్రెసిడెంట్లు, కార్యకర్తలు, మహిళా నాయకులు, సంబంధిత శాఖల అధికారులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.