నమస్తే శేరిలింగంపల్లి: అభివృద్ధియే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందని మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ అన్నారు. మాదాపూర్ డివిజన్ పరిధిలోని సైబర్ వ్యాలీ, విలేజ్ లో అధికారులతో కలిసి స్థానిక కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ పట్టణ ప్రగతి చేపట్టారు. మాదాపూర్ డివిజన్ పరిధిలోని ప్రతి కాలనీ, బస్తీ అభివృద్ధికి పక్క ప్రణాళికతో ముందుకు సాగుతామని, పట్టణ ప్రగతి కార్యక్రమం భాగంగా ప్రతి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. డివిజన్ పరిధిలోని కాలనీలలో ఉన్న చెత్తను తొలగించడం, డ్రైనేజీ వ్యవస్థను శుభ్ర పరచడం, మురికి నీటి గుంతలను తొలిగించి పరిసర ప్రాంతాలను పరిశుభ్రం చేయటమే లక్ష్యంగా పట్టణ ప్రగతి నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఏఈ ప్రశాంత్, వాటర్ వర్క్స్ మేనేజర్ నివర్తి, శానిటేషన్, ఎంటమాలజీ సిబ్బందితో పాటు సత్తి రెడ్డి, జయప్రకాష్, పండారి, రాజా, వెంకట్ గౌడ్, రాజి రెడ్డి, రామారావు, అశోక్ రెడ్డి, కార్తిక్, మురళి కృష్ణ, శ్రీకాంత్, వినయ్, సమరసింహ, అనిల్, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్ రావు, షఫీ, భార్గవ, రాహుల్, వరుణ్, శివ కుమార్, నవీన్, రాజు, శ్రీహరి, శంకర్ రావు, శ్రీనివాస్ రెడ్డి, మహేష్, రంజిత్, భాస్కర్, నరేష్, శ్రీధర్, విరెన్, విఠల్, ప్రాజెశ్, పురుషోత్తం, ప్రవీణ్, ధీరజ్, గురుమూర్తి, రవీందర్, సూర్యనారాయణ రెడ్డి, శ్రీహరి, ఇస్మాయిల్, జ్ఞానేశ్వర్, రాంప్రసాద్, యాదగిరి రెడ్డి, లింగా రెడ్డి, సందీప్, మహిపాల్ తదితరులు పాల్గొన్నారు.