నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి ద్వారా సీజనల్ వ్యాధులను నివారంచవచ్చని హఫీజ్ పేట్ డివిజన్ కార్పొరేటర్ వి.పూజిత జగదీశ్వర్ గౌడ్ అన్నారు. హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని మదీనగూడ గ్రామంలో మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి పట్టణ ప్రగతి నిర్వహించారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పట్టణ ప్రగతిలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో డీఈ సురేష్, వాటర్ వర్క్స్ మేనేజర్ మానస, శానిటేషన్ సుపర్ వైజర్ శ్రీనివాస్, ఎస్ ఆర్ పీ మహేష్, ఎంటమాలజిస్ట్ గణేష్, నాయకులు బాలింగ్ యాదగిరి గౌడ్, హఫీజ్ పేట్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్ గౌడ్, హఫీజ్ పేట్ డివిజన్ టీఆర్ఎస్ గౌరవ అధ్యక్షుడు వాలా హరీష్ రావు, నాయకులు లక్ష్మా రెడ్డి, వార్డు సభ్యులు కనకమామిడి వెంకటేష్ గౌడ్, మదీనగూడ టీఆర్ఎస్ బస్తి అధ్యక్షుడు ఆంజనేయులు యాదవ్, శ్రీనివాస్ గౌడ్, బాలరాజు యాదవ్, అశోక్ గౌడ్, బాబు మోహన్, మల్లేష్, ఆంజనేయులు, సాయి యాదవ్, నవీన్ యాదవ్, ప్రభాకర్, షేక్ సాబేర్, లక్ష్మణ్, వర్క్ ఇన్స్పెక్టర్లు, శానిటేషన్, ఎలక్ట్రికల్ కలీల్, వాటర్ వర్క్స్ సిబ్బంది అంబదాస్, సూర్యం తదితరులు పాల్గొన్నారు.