నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ లోని శిల్పారామంలో నిర్వహిస్తున్న గుర్జారీ హస్తకళ హాత్ లో పలు సాంస్కృతిక ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇండెక్స్-సి నిర్వహిస్తున్న గుర్జారీ హస్తకళా హాత్ లో దాదాపు 65 మంది గుజరాత్ చేనేత, హస్తకళాకారులు తమ తమ ఉత్పత్తులతో స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. ప్రముఖ భరతనాట్య కళాకారిణి సుబ్బ లక్ష్మి ఆధ్వర్యంలో అభ్యుదయ ఉత్సవ్ నృత్యోత్సవాన్ని, చెన్నై కళాక్షేత్రం పూర్వ విద్యార్థులు, యువ కళాభారతి ఇందు కళాక్షేత్రం భరతనాట్య శిక్షకురాలిగా సేవలు అందిస్తున్నారు.
నిధీశ్ వ్యవస్థాపకులు, డైరెక్టర్ ఇందిశ డాన్స్ స్కూల్ విద్యార్థులతో నృత్య ప్రదర్శనను ఏర్పాటు చేశారు. సుబ్బలక్షి నృత్యశాల విద్యార్థులు సరస్వతి వందన, అలరింపు, జతిస్వరం, కౌతం, కీర్తన, భజన తిల్లాన అంశాలను లాస్య శ్రీ, భవ్య, శ్రీక తదితరులు ప్రదర్శించగా ఇందు, శ్రీ నిధీశ్ అలరింపు ఖండం, గణపతే స్తుతి, వర్ణం, రుసలి రాధా, పూర్వి తిల్లాన అంశాలను ప్రదర్శించి మెప్పించారు. గుజరాత్ నుండి వచ్చిన కళాకారులు దాండియా రస నృత్యాన్ని ప్రదర్శించి మెప్పించారు.