ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు – రూ. 19.23 లక్షలతో సురభి కాలనీ ఎంపీపీఎస్ లో శంకుస్థాపన – ప్రభుత్వ విప్ గాంధీ, కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు – మన బడి కార్యక్రమాన్ని చేపట్టిందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా శేరిలింగంపల్లి డివిజన్ పరిధి సురభి కాలనీ లో ఎంపీపీఎస్ పాఠశాలలో రూ. 19. 23 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న ప్రహరీ గోడ పనులను, మౌలిక వసతుల అభివృద్ధి పనుల కోసం జోనల్ కమిషనర్ శంకరయ్య, డీసీ వెంకన్న, స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తో కలిసి ప్రభుత్వ విప్ గాంధీ శంకుస్థాపన చేశారు.

సురభి కాలనీలోని ఎంపీపీఎస్ ‌పాఠశాలలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్న ప్రభుత్వ విప్ గాంధీ, కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన ఊరు-మన బడి అద్భుత పథకం అని, ఈ పథకం ద్వారా ప్రభుత్వ బడులకు మహర్దశ కలిగిందన్నారు.‌ ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నాం అని చెప్పారు. మన ఊరు మన బడి పథకం‌ కింద సురభి కాలనీ పాఠశాలను ఎంపిక చేయడం ఆనందంగా ఉందన్నారు. ఉపాధ్యాయులు, అధికారులు, ప్రజాప్రతినిధులు సహకరిస్తే పేద పిల్లలకు ఆంగ్ల మాధ్యమంలో చదివే అవకాశం కలుగుతుందన్నారు. నిధులను సరిగా వాడుతూ నిర్ణీత సమయంలో అభివృద్ధి పనులు చేయాలని, పనులలో ఎటువంటి జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎంఈఓ వెంకటయ్య, ఈఈ శ్రీనివాస్, డీఈ రమేష్, ఏఈ సునీల్, ఏఎంఓహెచ్ డాక్టర్ నగేష్ నాయక్, జలమండలి అధికారులు మేనేజర్ యాదయ్య, ఎంటమాలజీ ఏఈ నగేష్, శానిటేషన్ సూపర్ వైజర్ జలందర్, మాజీ కౌన్సిలర్ వీరేశం గౌడ్, డివిజన్ అధ్యక్షుడు మారబోయిన రాజు యాదవ్ , ఎస్ఎంసీ చైర్మన్ బస్వరాజు, నాయకులు పద్మారావు, పొడుగు రాంబాబు, కృష్ణ యాదవ్, వేణు గోపాల్ రెడ్డి, రమేష్, నటరాజ్, గోపాల్ యాదవ్, రమణయ్య, బసవయ్య, జమ్మయ్య, నర్సింహ, కోదండరెడ్డి, బస్వరాజ్, శ్రీకళ, సౌజన్య, భాగ్యలక్ష్మి, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

సురభి కాలనీ ఎంపీపీఎస్ పాఠశాల విద్యార్థులతో ప్రభుత్వ విప్ గాంధీ, జడ్ సీ శంకరయ్య, కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here