నమస్తే శేరిలింగంపల్లి: రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య వైద్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు జన్మదిన వేడుకలు తెలంగాణ ప్రైవేటు ఉద్యోగ సంఘం అధ్వర్యంలో ఘనంగా జరిగాయి. మియాపూర్ డివిజన్ పరిధిలోని వివేకానంద సేవా వృద్దాశ్రమంలో తెలంగాణ ప్రయివేట్ ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకల్లో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పాల్గొన్నారు. వృద్ధాశ్రమంలోని వృద్ధులకు, అనాథ పిల్లలకు పండ్లు, నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య వైద్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. హరీష్ రావు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని టీపీయూఎస్ ఆధ్వర్యంలో వృద్ధులకు, అనాథ పిల్లలకు పండ్లు, నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, నాయకులు అక్తర్, టీపీయూఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు గంధం రాములు, రాష్ట్ర కోఆర్డినేటర్ ఎల్లా గౌడ్, కటకం రాము, శ్రీనివాస్ గోపరాజు, రోజా, ప్రేమ్ కుమార్, నాగరాజు, రామకృష్ణ, ఈశ్వర్ రెడ్డి, వెంకటేశ్వర్ రావు, తదితరులు పాల్గొన్నారు.