ప్రతి కాలనీలో పట్టణ ప్రగతి నిర్వహించాలి – పరిశుభ్రతకు ప్రాధాన్యతనివ్వాలి – ఐదో విడత పట్టణ ప్రగతిలో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: పట్టణాలు , పల్లెలు అన్ని రంగాలలో సమగ్ర సమ్మిళిత అభివృద్దే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాటుపడుతోందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు‌. పరిశుభ్రత – పారిశుధ్య కార్యక్రమాలను నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు మియాపూర్ డివిజన్ పరిధిలోని ఏఎస్ రాజు నగర్, డీకే ఎన్ క్లేవ్ కాలనీలలో ఐదో విడత పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ఉప కమిషనర్ సుధాంష్, కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి ప్రభుత్వ విప్ గాంధీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఐదో విడత పట్టణ ప్రగతి కార్యక్రమం 15 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందన్నారు.

మియాపూర్ డివిజన్ ‌లో జెండా ఊపి పట్టణ ప్రగతిని ప్రారంభిస్తున్న ప్రభుత్వ విప్ గాంధీ, కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్

పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా కాలనీల్లో, బస్తీల్లోని చెత్తను తొలగించడం, డ్రైనేజీ వ్యవస్థను శుభ్ర పరచడం, మురికి నీటి గుంతలను తొలిగించి పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా చేయటమే లక్ష్యంగా ముందుకు సాగాలని అధికారులను, కార్పొరేటర్లకు సూచించారు. అన్ని కాలనీలు, బస్తీలు ఆదర్శవంతమైన సుందరవనంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, నీటి నిల్వ డ్రమ్ములు, కూలర్ లోని నీటిని వారానికి ఒకసారి తొలగించాలన్నారు. రాబోయే వర్షా కాలంలో ఎలాంటి రోగాలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఇంట్లోని చెత్తను మురికి‌ కాలువల్లో, ఎక్కడ‌పడితే అక్కడ వేయకుండా మున్సిపల్ చెత్త బండికి అందజేయాలని అన్నారు. పారిశుద్ధ్య కార్మికులను గౌరవించడం మన బాధ్యత అని శానిటేషన్‌ విషయంలో రాష్ట్రానికి మంచి పేరు వచ్చిందని, దాన్ని కాపాడుకోవాలని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో జూన్ 3వ తేదీ నుంచి 18 వ తేదీ వరకు
ఆయా కాలనీల్లోని మురుగు కాలువలను శుభ్రం చేసి మురుగు నీరు, వర్షపు నీటి ప్రవాహాలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలన్నారు. రోడ్లపై ఎక్కడా మట్టి కుప్పలు, గుంతలు లేకుండా చూడాలని, వర్షపు నీరు గుంతలలో నిలువ ఉండకుండా, మంచి నీటి సరఫరా లైన్లలో లీకేజీలు లేకుండా చూడలన్నారు. వాటర్ పైప్ లైన్లు లీకేజీలతో నీరు కలుషితం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఓవర్ హెడ్ ట్యాంకులు, భూగర్భ నీటి ట్యాంకులు, సిమెంట్ ట్యాంకులు, ప్లాస్టిక్ డ్రమ్ములు, నీటి నిలువ చేసే ట్యాంకులలో దోమల లార్వాలను నాశనం చేసే చర్యలు చేపట్టాలని అన్నారు. ఖాళీ ప్రదేశాలలో చెత్తను, పొదలను, పనికి రాని అటవీ సంబంధిత మొక్కలను తొలగించి, పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా, మార్కెట్లు, పాఠశాలల పరిసరాలు, హాస్పిటల్స్, హోటల్స్, షాపులు, హాస్టల్స్ సమీపంలో ఎక్కడ చెత్త వేయకుండా ప్రజలలో అవగాహన‌ కల్పించాలని సూచించారు. జీహెచ్ఎంసి స్వచ్చ్ ఆటోలలో మాత్రమే చెత్తను వేసేలా ప్రజలను చైతన్య పర్చాలన్నారు.

చెత్తా చెదారాన్ని తొలగింపజేస్తున్న ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ

ఓపెన్ ప్లాట్లలలో ఎక్కడ చెత్త వేయకుండా చూసి ఎవరైనా చెత్త బహిరంగ ప్రదేశాలలో వేస్తే వారికీ జరిమానా విధించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వర్షపు నీరు నిలిచి ఇబ్బందులు ఎదుర్కొన్నట్లైతే జీహెచ్ఎంసి సిబ్బందికి తెలియపరిస్తే వెంటనే క్లియర్ చెయ్యాలని, లేకుంటే సంబంధిత సిబ్బంది పై చర్యలు తీసుకోవటం జరుగుతుందని ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ హెచ్చరించారు. హరిత తెలంగాణ లో భాగంగా ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఈఈ శ్రీకాంతిని, ఏఈలు శివ ప్రసాద్, ప్రతాప్, వర్క్ ఇన్‌స్పెక్టర్ విశ్వనాథ్, ఏఎంఓహెచ్ డాక్టర్ కార్తిక్, జలమండలి డీజీఎం నాగప్రియ, మేనేజర్ సాయి చరిత, స్ట్రీట్ లైట్స్ ఏఈ రామ్మోహన్, ఎంటమాలజీ ఏఈ గణేష్, శానిటేషన్ సూపర్ వైజర్ శ్రీనివాస్, ఎస్ఆర్పీలు కనకరాజు, మహేష్, టీఆర్ఎస్ నాయకులు బిఎస్ఎన్ కిరణ్ యాదవ్, మాధవరం గోపాలరావు, మహేందర్ ముదిరాజ్, ప్రతాప్ రెడ్డి, గోపరాజు శ్రీనివాస్, అశోక్, మురళి, అన్నిరాజు, చంద్రిక, రోజా, సుప్రజ, కొటయ్య, రాజు గౌడ్, స్వామినాయక్, అబ్రహం, సుధాకర్, సూర్యదేవర శ్రీనివాస్ రావు, మురళి, కమలాకర్, జంగం మల్లేష్, ఉమకిషన్, కప్పెర రమేష్, చందు, రాణి, లత, విజయ్ ముదిరాజ్, శ్రీకాంత్ రెడ్డి, రమేష్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

పట్టణ ప్రగతిపై పలు సూచనలు ఇస్తున్న విప్ గాంధీ

కొండాపూర్ డివిజన్ లో..
కొండాపూర్ డివిజన్ పరిధిలోని గోల్డెన్ తులిప్ కాలనీ లో జరిగిన ఐదో విడత పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని జోనల్ కమిషనర్ శంకరయ్య, ఉప కమిషనర్ వెంకన్న, స్థానిక గౌరవ కార్పొరేటర్ హమీద్ పటేల్ తో కలిసి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ప్రారంభించారు. గోల్డెన్ తులిప్ ‌కాలనీలో మొక్కలు నాటి‌ ప్రతి ఒక్కరూ మొక్కలను నాటడంతో పాటు వాటిని సంరక్షించాలని ఎమ్మెల్యే ‌గాంధీ సూచించారు.

కొండాపూర్ డివిజన్ లోని గోల్డెన్ తులిప్ లో మొక్కలను నాటుతున్న ప్రభుత్వ విప్ గాంధీ, కార్పొరేటర్ హమీద్ పటేల్

పట్టణ ప్రగతిలో భాగంగా ప్రతి కాలనీలో పరిసరాల పరిశుభ్రత, తదితర వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఈఈ శ్రీనివాస్, డీఈలు రమేష్, విశాలాక్షి,‌ ఏఈ జగదీష్, వర్క్ ఇన్‌స్పెక్టర్ వెంకటేష్, ఏఎంఓహెచ్ డాక్టర్ నగేష్ నాయక్, వాటర్ వర్క్స్ మేనేజర్ సందీప్, ఎంటమాలజీ ఏఈ నగేష్, శానిటేషన్ సూపర్ వైజర్ జలందర్, ఎస్ ఆర్ పీ రాజయ్య, నాయకులు తిరుపతి, రజనీకాంత్ , తిరుపతి యాదవ్, రూప రెడ్డి, రవి శంకర్ నాయక్, అశోక్ సాగర్, సయ్యద్ ఉస్మాన్, అంజాద్, మురళి కిషోర్, శ్యామల, గోల్డెన్ తులిప్ కాలనీ అసోసియేషన్ అధ్యక్షుడు విద్యాసాగర్ రెడ్డి, సెక్రటరీ శివకుమార్ రాజు, జాయింట్ సెక్రటరీ సుధాకర్ రెడ్డి, కృష్ణ, సభ్యులు ఎస్వీయన్ రాజు, రాజా రాజేశ్వరి కాలనీ ప్రెసిడెంట్ విజయకృష్ణ, వైస్ ప్రెసిడెంట్ మధు ముదిరాజ్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

పట్టణ‌ ప్రగతి పోస్టర్ ను విడుదల చేస్తున్న ఎమ్మెల్యే గాంధీ, జడ్సీ శంకరయ్య, కార్పొరేటర్ హమీద్ పటేల్,

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here