నమస్తే శేరిలింగంపల్లి: ప్రతి ఒక్కరూ తమతమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నీటిని నిల్వ చేయకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ సూచించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఐదో విడత పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని శేరిలింగంపల్లి డివిజన్ లోని గోపినగర్, నెహ్రూనగర్ కాలనీలలో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ప్రారంభించారు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు కార్పొరేటర్ నాగేందర్ యాదవ్ కాలనీలలో తిరుగుతూ ప్రజలకు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో లేదా తమ పరిసర ప్రాంతాల్లో నిలువ ఉండే నీటిని తొలగించి, దోమల నివారణకు తోడ్పాటును అందించాలన్నారు. పిచ్చి మొక్కలతో పాటు, కుండీల్లో నిల్వఉన్న నీటిని తొలగించాలని సూచించారు. పట్టణ పరిశుభ్రతకు చిత్త శుద్దితో జీహెచ్ఎంసీ పాలకవర్గం, సిబ్బంది నిరంతరం కృషి చేస్తుందని చెప్పారు. ప్రజల భాగస్వామ్యంతోనే పట్టణ పరిశుభ్రత పూర్తి స్థాయిలో సాధ్యం అవుతుందని నాగేందర్ యాదవ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ఉపాధ్యక్షుడు యాదాగౌడ్, వార్డు మెంబర్ పర్వీన్ బేగం, బస్తీ కమిటీ అధ్యక్షులు గోపాల్ యాదవ్, శ్రీకాంత్, నాయకులు లక్ష్మణ్ యాదవ్, బసవరాజు లింగాయత్, నర్సింహా, మహేందర్, సుమన్, పెంటయ్య, గౌతమ్, వాటర్ వర్క్స్ మేనేజర్ యాదగిరి, జీహెచ్ఎంసీ సిబ్బంది, కార్యకర్తలు, కాలనీవాసులు, తదితరులు పాల్గొన్నారు.
