నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఉద్యోగ నోటిఫికేషన్ కు సన్నద్ధమయ్యే శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని యువతకు ఉచిత శిక్షణ తరగతులు ఎంతగానో ఉపయోగపడుతాయని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని నిరుపేద నిరుద్యోగ యువతీయువకులకు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న ఉచిత శిక్షణ తరగతుల గోడ పత్రికను మియాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కార్పొరేటర్లతో కలిసి ప్రభుత్వ విప్ గాంధీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఉద్యోగ నోటిఫికేషన్లకు నిరుద్యోగ యువత సమాయత్తం కావాలన్నారు. ఎస్ఐ, కానిస్టేబుల్, టీఎస్ పీఎస్సీ, గ్రూప్స్‌కు, ఇతర పోటీ పరీక్షలు రాసే శేరిలింగంపల్లి నియోజకవర్గం నిరుద్యోగ యువతీయువకుల కోసం ఉచిత శిక్షణ శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు.
ఉచిత శిక్షణ తరగతులకు అర్హులైన యువతీ యువకులు ఈ నెల 11 వ తేదీ వరకు మియాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ నెల 15 వ తేదీన రాత పరీక్ష నిర్వహించి, ఎంపికైన వారికి ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే గాంధీ తెలిపారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక లక్షా 32 వేల పోస్టులు భర్తీ చేసిన ఘనత సీఎం కేసీఆర్ కి దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్ గౌడ్, జగదీశ్వర్ గౌడ్, జూపల్లి సత్యనారాయణ, నార్నె శ్రీనివాస రావు, ఉప్పలపాటి శ్రీకాంత్, శ్రీమతి పూజితజగదీశ్వర్ గౌడ్, రోజాదేవి రంగారావు, మాజీ కార్పొరేటర్ రంగారావు, వివేకానంద నగర్ డివిజన్ అధ్యక్షుడు సంజీవ రెడ్డి, చందానగర్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, ఆల్విన్ కాలనీ డివిజన్ అధ్యక్షుడు సమ్మారెడ్డి, మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, హఫీజ్ పెట్ డివిజన్ అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్ గౌడ్, నాయకులు ఆదర్శ్ రెడ్డి, పోశెట్టి గౌడ్, స్వామి నాయక్ తదితరులు పాల్గొన్నారు.