రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన నేతలు

నమస్తే శేరిలింగంపల్లి: రంజాన్ పవిత్ర పండగను పురస్కరించుకుని చందానగర్ డివిజన్ పరిధిలోని టీఆర్ఎస్ మైనార్టీ నాయకులకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. చందానగర్ కు చెందిన అహ్మద్ బాయ్, అన్వర్ షరీఫ్, అక్బర్ ఖాన్, మహమ్మద్ బేగ్ నివాసాలకు కార్పొరేటర్లు రాగం నాగేందర్ యాదవ్, ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ వెళ్లి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేకంగా తయారు చేసిన షీర్ కుర్మా స్వీట్ ను స్వీకరించారు.

టిఆర్ఎస్ మైనారిటీ నేత అన్వర్ షరీఫ్ నివాసంలో రంజాన్ వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్ గాంధీ, కార్పొరేటర్ శ్రీకాంత్ ఇతర నేతలు

ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ వీరేశం గౌడ్ , చందానగర్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, సీనియర్ నాయకులు మిరియాల రాఘవ రావు, ఉరిటి వెంకట్రావు, హోప్ ఫౌండేషన్ ఛైర్మెన్ కొండా విజయ్, సుప్రజ ప్రవీణ్, ఓ. వెంకటేష్ , రవీందర్ రెడ్డి, మిరియాల ప్రీతమ్, మహేందర్ ముదిరాజ్, నటరాజ్, గోపాల్ యాదవ్, దాస్, నరేందర్ బల్ల, సందీప్, అమీత్, యశ్వంత్, అవినాష్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

చందానగర్ లోని టీఆర్ఎస్ మైనార్టీ నాయకులు అక్బర్ ఖాన్ నివాసంలో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ, కార్పొరేటర్లు

శేరిలింగంపల్లి నియోజక వర్గం లోని ముస్లిం మైనార్టీ నాయకులకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జెరిపాటి జైపాల్, మహిపాల్ యాదవ్, కాట నర్సింహా గౌడ్, పోచయ్య, రాజేందర్, ముత్యం రెడ్డి, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు సౌందర్య రాజన్, ముషారఫ్, సలీమ్, అసిఫ్, అసద్, ఆఫ్రోజ్, కరీం, ఖాజా, మెహరాజ్ ఖాన్ తదితరులు రంజాన్ పండగ శుభాకాంక్షలు తెలిపారు.

ముస్లిం మైనార్టీలకు రంజాన్ పండగ శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు జెరిపాటి‌‌ జైపాల్

మియాపూర్ ఈద్గాలో రంజాన్ పండగను పురస్కరించుకుని ముస్లిం మైనార్టీ సోదరులు ప్రత్యేక నమాజ్ ప్రార్థనలు చేశారు. ఇలియాస్ షరీఫ్, సాబర్ షరీఫ్, అస్మత్ షరీఫ్, యాసీన్ షరీఫ్, మహ్మద్ షరీఫ్, అన్వర్ షరీఫ్, యూనస్ షరీఫ్, దౌలత్ పాషా, వజీర్, గజాలి, షరీఫ్ అల్లం, రుక్ముద్దీన్, మొహ్సిన్, జావీద్, అహ్కీల్, వహీద్, అంజద్, తదితర మజీద్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

మియాపూర్ ఈద్గా వద్ద నమాజ్ చేస్తున్న ముస్లిం మైనార్టీ సోదరులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here