నమస్తే శేరిలింగంపల్లి: సామాజిక సేవ చేయడంలో ఉన్న తృప్తి మరెందులోనూ లేదని, దాతల సహాయసహకారాలు ఉంటే భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడుతామని ఆశ్రీ సొసైటీ నిర్వాహకులు పూర్ణి కిషోర్ దంపతులు పేర్కొన్నారు. మియాపూర్ మక్తా మహబూబ్ పేట్ లోని జడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 40 మంది పదో తరగతి విద్యార్థులకు ఆశ్రీ సొసైటీ ఆధ్వర్యంలో ఎగ్జామ్ కిట్స్, పెన్నులు, ప్యాడ్స్, స్టేషనరీ, నోట్ బుక్స్ అందజేశారు.
ఆశ్రీ సొసైటీ నిర్వాహకులు పూర్ణి కిషోర్ మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి తల్లిదండ్రులకు, పాఠశాల ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఇలాంటి సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకునే దాతలు ఆశ్రీ సొసైటీకి సహకరించాలని కోరారు. ఆసక్తి గల దాతలు ఆర్థికంగా సహకరించాలనుకుంటే ఆశ్రీ సొసైటీ, అకౌంట్ నంబర్ 34027311764, ఐఎఫ్ఎస్ సీ కోడ్ SBIN0011668, ఎస్ బీ ఐ బ్రాంచి, మియాపూర్ ద్వారా గాని, 9293414444 తెజ్, పే టీం ల ద్వారా ఆర్థిక సహాయం అందించి చేయూతనందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు అయుబ్, యూసఫ్, రియల్ పేజీ టీం సభ్యులు పాల్గొన్నారు.