నమస్తే శేరిలింగంపల్లి: వ్యూహాత్మక నాలా అభివృద్ధి కార్యక్రమం లో భాగంగా ఈర్ల చెరువు నుండి దీప్తి శ్రీ నగర్ నాలా వరకు రూ. 15.88 కోట్ల అంచనా వ్యయం తో 2.4 కిలోమీటర్ల మేర నాలా విస్తరణ పనులను చేపట్టడం జరిగిందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని ఈర్ల చెరువు నుండి దీప్తి శ్రీ నగర్ నాల వరకు చేపట్టిన నాలా విస్తరణ పనులలో భాగంగా మదీనగూడ రామ కృష్ణ నగర్ లో జరుగుతున్న నాల విస్తరణ పనులను ఇరిగేషన్ అధికారులతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా నాలా విస్తరణ పనులు చేపట్టినట్లు తెలిపారు. ఎన్నో ఏండ్ల సమస్య తీరునుందని, రాబోయే వర్షకాలాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రణాళికలు రూపొందించి యుద్ధప్రాతిపదిక నాలాల విస్తరణ పనులను వేగవంతం చేసి పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఏఈ పావని, హఫీజ్ పెట్ డివిజన్ పార్టీ గౌరవ అధ్యక్షుడు వాలా హరీష్ , చందానగర్ డివిజన్ పార్టీ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, కాలనీ వాసులు ఉమా మహేశ్వర రావు, సురేందర్, వీరభద్రరావు, విష్ణువర్ధన్ రెడ్డి కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.