నమస్తే శేరిలింగంపల్లి: పేద విద్యార్థులకు తమవంతు సహాయంగా నోట్ బుక్స్, స్టడీ మెటీరియల్ ను అందజేయడం జరుగుతుందని ఆర్ కే వై ఫౌండేషన్ చైర్మన్ రవి కుమార్ యాదవ్ అన్నారు. ఆర్ కే వై ఎఫ్ ఆధ్వర్యంలో గచ్చిబౌలి, రాయదుర్గం, ఖాజాగూడ, లింగంపల్లి, ముక్తా మహబూబ్ పేట్ లోని ప్రభుత్వ పాఠశాలల్లో, గంగారంలోని విశ్వ విద్యాలయం హై స్కూల్ లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులకు ఉచిత స్టడీ మెటీరియల్ ను రవికుమార్ యాదవ్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రవి కుమార్ యాదవ్ మాట్లాడుతూ ప్రస్తుత రోజుల్లో ఖరీదైన విద్యను పొందలేక ఎంతో మంది నిరు పేద విద్యార్థులు మధ్యలోనే చదువుకు దూరమవుతున్నారని, అలాంటి వారికి ఆర్ కే వై టీం అండగా నిలుస్తూ తమ వంతు సహాయంగా స్టడీ మెటీరియల్ ను ఉచితంగా అందజేస్తున్నామని అన్నారు. విద్యార్థులు మంచిగా చదువుకొని ఉత్తీర్ణులు కావడానికి ఈ స్టడీ మెటీరియల్ ఎంతగానో అవసరపడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కంచర్ల ఎల్లేష్, ఆంజనేయులు సాగర్, రమేష్ నాయి, భరత్, గణేష్ ముదిరాజ్, శ్రీనివాస్, రాము, సోమయ్య యాదవ్, దేవేందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.