నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ లోని శిల్పారామంలో డిస్ట్రిక్ట్ హ్యాండ్లూమ్ ఎక్స్ పో సందర్బంగా నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని ఆకట్టుకున్నాయి. భారతీయ కళా క్షేత్రం ఆధ్వర్యంలో సంకీర్తనలు, కూచిపూడి నృత్య ప్రదర్శనలు నిర్వహించారు.
పద్మ, సత్యం శిష్య బృందం ప్రదర్శించిన అన్నమయ్య, రామదాసు సంకీర్తనల ఆలపన ఎంతగానో ఆకట్టుకుంది. గాత్రం చేసిన వారు సౌమ్య శ్రీదేవి, వాణి, రమ్య, దీపశిక, శ్రీనిక, గాయత్రీ చేతనా, ఆనంది, ప్రణవ్ తదితరులు గానం చేశారు. వీరికి తబలా మోహన్ రావు, ఫ్లూట్ కేశవ్ దాస్, కీ బోర్డు సుదర్శన్ వాయించి సహకరించారు. రశ్మిత, అశ్విని శిష్య బృందం కూచిపూడి నృత్య ప్రదర్శనలో మూషిక వాహన, వినాయక కౌతం, జనుత శబ్దం, జతిస్వరం, వినరో భాగ్యము, పలుకఁరీ బంగారమయేహ్న, మూడుగారేయ్ యశోద, తిల్లాన, గజ వాదన, జయ జయ దుర్గ, జయదేవ అష్టపదులు, హనుమ చాలీసా, తిల్లాన అంశాలను ప్రదర్శించారు. హరిణి, సిరి, లోహిత, సంవిక, దుర్గ, భార్గవి, రాజశ్రీ, లావణ్య, సాహితి, భావిక, సుష్మ తదితరులు ప్రదర్శించారు.