నమస్తే శేరిలింగంపల్లి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్, విద్యుత్ చార్జీలను పెంచుతూ పేద ప్రజల పై భారం మోపుతున్నాయని కాంగ్రెస్ పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గం నాయకులు జెరిపాటి జైపాల్ అన్నారు. టీపీసీసీ ఆదేశాల మేరకు రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు చల్లా నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ముట్టడిలో శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు జేరిపెటి జైపాల్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జెరిపాటి జైపాల్ మాట్లాడుతూ ధరల పెంపుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ ధరలతో పాటు విద్యుత్ చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రఘునందన్ రెడ్డి, మారేళ్ల శ్రీనివాస్, జావీద్ హుస్సేన్, సురేష్ నాయక్, కాట నరసింహా గౌడ్, పోచయ్య, యువజన అధ్యక్షుడు సౌందర్య రాజన్, దుర్గేష్, రాజేష్ గౌడ్, తరుణ్, ఆమ్లా, సునీల్, చందు, శశి తదితరులు పాల్గొన్నారు.