నమస్తే శేరిలింగంపల్లి: కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వామపక్షాల కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మియాపూర్ లో నిరసన కార్యక్రమం చేపట్టారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా వామపక్ష కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మియాపూర్ లోని మీ సేవ కేంద్రం నుండి బొల్లారం చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వామపక్ష కార్మిక సంఘాల నాయకులు కృష్ణ ముద్రాజ్, రామకృష్ణ, అనిల్ మాట్లాడుతూ దేశంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా మూడు లేబర్ కోడ్ బిల్లును తీసుకురావడంతో భవిష్యత్తులో కార్మికులకు కనీస పని గంటలు పోతున్నాయని అన్నారు. వాటితో పాటు ఈఎస్ఐ, పీఎఫ్ఐ కార్మికులకు అందాల్సిన ఎలాంటి ప్రయోజనాలు అందకుండా పోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఈ బిల్లును వెనక్కి తీసుకోవాలని మార్చి 28, 29 తేదీల్లో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జరుగుతుందని తెలిపారు. ఈ సమ్మెకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు అభిషేకం పాల్గొని మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో వామపక్ష కార్మిక సంఘాల నాయకులు, కన్నా శ్రీనివాస్, రవి రాములు, మురళి, సుల్తాన్ బేగం, ఆమెన్ బేగం, డి. లక్ష్మి అంగడి పుష్ప, తదితరులు పాల్గొన్నారు.