నమస్తే శేరిలింగంపల్లి: వాకింగ్ చేస్తున్న వ్యక్తి అకస్మాత్తుగా కిందపడి మృతి చెందిన సంఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కొండాపూర్ కు చెందిన బత్తిని ఉదయ భాస్కర్ దుర్గా ప్రసాద్(42) అనే వ్యక్తి ఆదివారం సాయంత్రం నోవాటెల్ హోటల్ వెనక ఉన్న హై టెన్షన్ రోడ్డులో వాకింగ్ చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా కింద పడిపోయాడు. అతని చుట్టు పక్కల వారు గమనించి కొండాపూర్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఆస్పత్రి వైద్యులు పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు. మృతుని భార్య సుమతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.