నమస్తే శేరిలింగంపల్లి: దేవాలయాల సందర్శనతో ఆధ్యాత్మిక వాతావరణం అలవడుతుందని, మానసిక ప్రశాంతత లభిస్తుందని పరమహంస పరివ్రాజకాచార్యులు మదనానంద సరస్వతీ పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ మాధవానంద సరస్వతీ స్వామి అన్నారు. నల్లగండ్ల లోని శ్రీ భవాని రాజరాజేశ్వర స్వామి ఆలయంలో విశేష మహారుద్రాభిషేకం నిర్వహించారు. మాధవానంద సరస్వతీ స్వామి ఆధ్వర్యంలో 1331 లీటర్ల ఆవుపాలతో విశేష మహా రుద్రాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ నాగేందర్ యాదవ్, తెలంగాణ రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ బోర్డ్ ఛైర్పర్సన్ రాగం సుజాతయాదవ్ పాల్గొని శివలింగానికి ఆవుపాలతో అభిషేకం నిర్వహించారు. మాదావానంద స్వామి ఆశీస్సులు తీసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు మిరియాల రాఘవ రావు, మాజీ కౌన్సిలర్ సోమదాస్, ఆలయ కమిటీ ప్రెసిడెంట్ సత్యనారాయణ రెడ్డి, రాజి రెడ్డి, రంజిత్ రెడ్డి, నరేందర్ రెడ్డి, రాజు, గోవర్ధన్ రెడ్డి, రఘుపతి రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు, భక్తులు పాల్గొన్నారు.